సాయంత్రం వేళ వ్యాయామం ఉత్తమం
* ఊబకాయం, మధుమేహులకు ఎంతో ప్రయోజనం
ఆరోగ్యం Health : సాయంత్రం వేళ వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.ముఖ్యంగా మధుమేహం, ఊబకాయంతో బాధపడుతున్న వారికి సాయంత్రం పూట చేసే వ్యాయామం చాలా మేలు చేస్తుందని తేలింది. 40 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 30 వేల మందిపై ఎనిమిదేండ్ల పాటు చేసిన ఈ అధ్యయనం వివరాలు 'డయాబెటిస్ కేర్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి మధ్య వ్యాయామం, శారీరక శ్రమ చేసే వారిలో గుండెజబ్బులు, అకాల మరణ ముప్పు తక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఎలాంటి వ్యాయామం చేసినా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, వాకింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం, ఇల్లు శుభ్రం చేయడం వంటివేవి చేసినా మేలేనని పరిశోధకులు పేర్కొన్నారు.