కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
దిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : ఈడీ తనపై నమోదుచేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మంగళవారం దీనిపై విచారణ జరగాల్సి ఉన్నా రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా సెలవుపై వెళ్లడంతో కేసు తదుపరి విచారణను 22కి వాయిదా వేశారు. అదే రోజు కవిత ఈడీ, సీబీఐ కేసుల్లోని బెయిల్ అప్లికేషన్లపై విచారణ జరగనుంది.