నేడు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ రైతు దీక్షలు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గులాబీ నేతలు రైతు దీక్షలు నిర్వహించనున్నారు. ఈ రైతు దీక్షలు అన్ని జిల్లా కేంద్రాలలో చేపట్టనున్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేస్తూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ శ్రేణులు ఈ దీక్షల్లో పాల్గొంటారు.కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంతో పాటు నీరు లేక ఎండిన నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్ తో, అలాగే క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వా లనీ గులాబీ నేతలు ఇవాళ దీక్షలు చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో మాజీమంత్రి కేటీ ఆర్, సంగారెడ్డి లో హరీష్ రావు పాల్గొంటారు.రైతుబంధు విడుదలలో జాప్యం, కరెంట్‌కోతలు, ధాన్యానికి రూ. 500 బోనస్ హామీ ఇచ్చి నిలబెట్టుకోక పోవటమే కాకుండా కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో 209 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు” అని బీఆర్‌ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమ లుచేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ అన్ని జిల్లా ల్లో రైతు దీక్షలు చేయ నున్నది.సిరిసిల్లలో కేటీఆర్, సంగా రెడ్డిలో హరీశ్‌రావు, సూర్యా పేటలో జగదీశ్‌రెడ్డి, పాల కుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు సహా మాజీ మంత్రు లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతుదీక్షలు చేపట్టనున్నారు.