Type Here to Get Search Results !

Sports Ad

ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సీఎస్‌ల కీలక సమావేశం Important meeting of AP and Telangana CSs in the background of elections


 ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సీఎస్‌ల కీలక సమావేశం

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : లోక్ సభ ఎన్నికల నేప థ్యంలో నిర్వహణపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు.హైదరాబాద్‌‌లోని సచివా లయంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిలు సమావేశ మయ్యారు. ఎన్నికల నేప థ్యంలో మరింత సమన్వ యంతో పని చేయాలని ఇరువురు సీఎస్‌లు నిర్ణయించారు.సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమన్వయ భేటీలు జరిగినట్లు అధికా రులు వెల్లడించారు. పోలింగ్ ముగిసే వరకు పకడ్బందీగా వ్యవహరిం చాలని నిర్ణయించినట్లు తెలిపారు.అక్రమ మద్యం, డ్రగ్స్‌ రాకుండా సరిహద్దుల్లో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గోవా, కర్ణాటక నుంచి మద్యం రాకుండా సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్రమ మద్యం, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువుల రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు.
     శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఇదే వాతావరణాన్ని పోలిం గ్ వరకు పకడ్బందీగా కొనసాగించేందుకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం దోహదపడుతుందన్నారు.తెలంగాణ తరఫున పోలీస్ శాఖ ద్వారా 36 అంతరాష్ట్ర చెక్‌పోస్టులు, ఆటవీ శాఖకు సంబంధించి మూడు అంత రాష్ట్ర చెక్‌పోస్టులు, ఎక్సైజ్‌ శాఖ ఎనిమిది, 224 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు, వాణిజ్యపన్నుల శాఖ ద్వారా ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పటిష్టమైన గస్తీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సీఎస్ తెలిపారు.తెలంగాణలో తీవ్రవాద ప్రాబల్యం లేదని, ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు జరుగ కుండా ఇరురాష్ట్రాలు పోలీసులు, కేంద్ర బలగాలు పటిష్టమైన సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నం దున ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేం దుకు పూర్తిస్థాయి సమన్వ యంతో కృషి చేస్తున్నామ న్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* యూపీఎస్పీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
* పెద్దపల్లి జిల్లాలో వడదెబ్బ తో వ్యవసాయ రైతు మృతి? ఇక్కడ క్లిక్ చేయండి
* ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సీఎస్‌ల కీలక సమావేశం ఇక్కడ క్లిక్ చేయండి
* కరెంట్‌ షాక్‌తో మరణిస్తే 5 లక్షలు పరిహారం ఇక్కడ క్లిక్ చేయండి
* మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ.. ఇక్కడ క్లిక్ చేయండి
* కౌంట్ డౌన్ మొదలైనట్టే... ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణల్లో నామినేషన్ల పర్వం... ఇక్కడ క్లిక్ చేయండి
* ఫెయిర్నెస్ క్రీమ్ లతో కీడ్నీలకు హాని ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies