సోమవారం,మంగళవారం భానుడి భగభగలు
* ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్కుపైగా నమోదయ్యాయి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : శనివారం.ఆదివారం వరకు వర్షాలు, చలిగాలులతో ఉపశమనం పొందిన ప్రజలకు అలర్ట్. ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. ఆదివారం ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్కుపైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా మహబూబాబాద్ డి మరిపెడ, భద్రాద్రి డి అశ్వాపురం మండలాల్లో 42.7 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. సోమవారం,మంగళవారం ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.