మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు : సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తుక్కుగూడలో శనివారం నిర్వహించిన జనజాతర సభకు వచ్చిన స్పందనపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ ఓ మహా సముద్రం.. అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదు.. పేదల బంధువులు. మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు. వాళ్లు త్యాగశీలురు, తెగించి కొట్లాడే వీరులు. జెండా మోసే బోయీలు మాత్రమే కాదు.. అజెండాలు నిర్ణయించే నాయకులు. నిన్నటి తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది.. చేసిన శబ్దమిది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.