తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో రెండు రోజులు వర్షాలు తెలంగాణలో మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.