యూపీఎస్పీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల
ఉత్తరప్రదేశ్ Uttar Pradesh News భారత్ ప్రతినిధి : యూపీఎస్సీ సివిల్స్ ఫలి తాలు ఇవాళ విడుదల య్యాయి.మొత్తం 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్ వచ్చింది. అనిమేశ్ ప్రధాన్‌కి రెండో ర్యాంక్ రాగా, తెలుగ మ్మాయి దొన్నూరు అనన్య రెడ్డికి మూడో ర్యాంకు దక్కింది.పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, రుహాని నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.ఆ తదుపరి స్థానాల్లో సృష్టి దబాష్, అన్మోల్ రాఠోఢ్, ఆశీష్ కుమార్, ఐశ్వర్యం ప్రజాపతి ఉన్నారు.జనరల్ కేటగిరీలో 347 మంది ఎంపిక కాగా, 303 మంది ఓబీసీ, 165 మంది ఎస్సీ కేటగిరీలో, 86 మంది ఎస్టీ కేటగిరీలో ఎంపిక య్యారు. ఈడబ్ల్యూఎస్ నుంచి 115 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది.