బైక్ పై నుంచి కిందపడి మహిళ మృతి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండలం తావ్రయ్య నాయక్ తండాకు చెందనా చౌహాన్ గున తారి బాయి బైక్ పై వెళ్తుండగా కింద పడి అక్కడికక్కడే మృతి చండడం జరిగింది. ఇట్టి విషయాన్ని ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం, చౌహాన్ చాగున తారి బాయి వయసు 36 అనే మహిళ, తన కుటుంబ సభ్యులతో పాటు తావ్య నాయక్ తాండా మాసన్పల్లి గ్రామం నుండి తల్లిగారి గ్రామమైన బొందంపల్లి తాండ కర్ణాటకకు నిన్న తేదీ 07.04.2024న మధ్యాహ్నం పూజకు రెండు బైకులపై వెళుతుండగా,మార్గ మధ్యలో నవాల్ల గ్రామం దాటినాక,వెనకాల కూర్చున్న తారీబాయి హనుమాన్ గుడికి దండం చేయుటకు అజాగ్రత్తగా తన చేతిని వదిలేయగా, వెల్లికిలా బి.టి రోడ్డుపై పడి తలకు రక్త గాయం అయ్యి,అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.08.04.2024 మృతురాలి భర్త జాదవ్ సంజీవ్ ఇచ్చిన పిర్యాదు మేరకు బషీరాబాద్ ఎస్.ఐ రమేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.