పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతిపై అత్యాచారం A young woman was raped by believing that she would get married
Bharath NewsApril 11, 2024
0
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతిపై అత్యాచారం
కాచిగూడ Kachiguda Newsభారత్ ప్రతినిధి : పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతిపై అత్యాచారం పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన యువకుడిని కాచిగూడ పోలీసులు బుధవారం రిమాండుకు తరలిచారు. SI సుభాశ్ వివరాల ప్రకారం.. గోల్నాకలో నివాసం ఉంటున్న యువతి (29) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో సత్యానగర్ వాసి అఖిల్ (30)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరైన అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.