Type Here to Get Search Results !

Sports Ad

ఖరీఫ్ వరి ధాన్యానికి రూ..2680 2680 for Kharif paddy

 ఖరీఫ్ వరి ధాన్యానికి రూ..2680

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : వ్యవసాయరం గానికి ఈ సారి ఖరీఫ్ పంటల సీజన్ మరింతగా కలిసివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసా య మార్కెట్ ఇంటలిజెన్స్ నివేదిక ప్రకారం పంటల ధ రలు భారీగా పెరిగి అన్నదాతలకు లాభాలు పం డించబోతున్నాయి. వరి ధాన్యానికి ఏ గ్రేడ్ రకం క్వింటాలకు రూ.2680, పత్తికి క్వింటాలు కు రూ.7200 వరకు ధరలు లభించే అవకాశాలు ఉ న్నాయి. రాష్ట్రంలో సాగులోకి వచ్చే పంటల విస్తీర్ణంలో ఈ రెండు పంటలే 80శాతంపైగా సాగులో కి రానున్నాయి . వాణిజ్యపంటల్లో మిరపకు రూ. 16500 వరకూ ధరలు లభించే అవకాశాలు ఉన్న ట్టు అంచనా వేశారు.మొక్కజొన్నకు కూడా రూ. 2350 వరకూ ధరలు లభించే అవకాశాలు ఉన్నా యి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ ఆర్దిక శాస్త్రవిభాగం రాష్ట్రంలో పండించే పంటలపైన ప్ర తిఏటా ముందస్తు పంటల ధరల అంచనాల ని వేదికలను రూపొందిస్తుంది.రాష్ట్రంలోని ముఖ్యమై న మార్కెట్లలో గత ఆరు నుంచి 22 సంవత్సరాల కు సంబంధించిన వివిధ రకాల పంటలకు ల భించిన ధరలను విశ్లేషించి అంచానాలు రూపొంది స్తూ వస్తోంది. పంట రకం నాణ్యత అంతర్జాతీ య మార్కెట్ల ధరలు ఎగుమతి లేదా దిగుమతి ప రిమితుల మూలంగా అంచనాల ధరల్లో మా ర్పు లు కూడా ఒక్కోసారి ఈ అంచనా ధరలను ప్ర భావితం చేస్తుంటాయని తెలిపింది. 

   విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ ఆర్ధిక శాస్త్ర విభాగం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ ఆర్ధిక సహాయంతో ప్రతిఏటా పంటల ముందస్తు మార్కెట్ ధరల నివేదికలను విడుదల చేస్తుంది. ఈ కేంద్రం 2024-25 సంవత్సర కాలానికి సంభంధించి ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసే వివిధ రకాల పంటలకు ముందస్తు ధరలు ఆయా పంటల కోతల సమయంలో ఏవిధంగా ఉంటుందో అంచాన వేసింది.ఈ ముందస్తు ధరలను అంచనా వేసేందుకు రాష్ట్రంలోని మార్కెట్ సర్వేలను అనుసరించింది. పంటల ముందస్తు ధరల అంచనా నివేదికను సోమవారం విడుదల చేసింది.వరికి నవంబర్ డిసెంబర్ మధ్యకాలంలో సూర్యాపేట మార్కెట్‌లో క్వింటాలు రూ.2203-2350కి అంచనా వేసింది. అదే ఏ గ్రేడ్ వరి ధాన్యానికి జమ్మికుంట మార్కెట్‌లో రూ.2290-2680గా అంచనా వేసింది. మొక్కజొన్న అక్టోబర్‌నవంబర్ మధ్యకాలంలో బాదేపల్లి మార్కెట్‌లో రూ.2150-2350గా అంచనా వేసింది. జొన్న పంట ధర సెప్టెంబర్‌అక్టోబర్ మద్య కాలంలో మహబూబ్ నగర్ మార్కెట్‌లో 2200-2500రూపాయలుగా అంచనా వేసింది. సజ్జపంటకు నిజామాబాద్ మార్కెట్‌లో రూ.1990-2270గా అంచనా వేసింది. రాగి పంటకు మహబూబ్‌నగర్ మార్కెట్‌లో రూ.2710-3120గా అంచనా వేసింది. పెసరకు సూర్యాపేట మార్కెట్‌లో రూ.7200-7500గా అంచనా వేసింది. కందికి జనవరిఫిబ్రవరి నెలల మధ్య తాండూర్ మార్కెట్‌లో రూ.9500-9800గా అంచనా వేసింది.ఇదే మార్కెట్‌లో మినుముకు రూ.7090-7580గా అంచనా వేసింది. వేరుశనగకు గద్వాల మార్కెట్‌లో రూ.6500-6800గా అంచనా వేసింది. సోయాచిక్కుడుకు నిజామబాద్ మార్కెట్‌లో రూ.4700-5000గా అంచనా వేసింది. పొద్దుతిరుగుడు పంటకు సిద్దిపేట మార్కెట్‌లో 3800-4000రూపాయలుగా అంచనావేసింది. 

   ఆముదం పంటకు గద్వాల మార్కెట్‌లో రూ.5300-5600గా అంచనా వేసింది. పత్తికి వరంగల్ మార్కెట్‌లో నవంబర్ నుంచి రూ.6600-7200గా అంచనా వేసింది. మిరపకు రూ.14500-16500గా అంచనా వేసింది. పసుపు పంటకు నిజామాబాద్ మార్కెట్‌లో ఫిబ్రవరి నుంచి రూ.10500-11000గా అంచనా వేసింది. కూరగాయల ధరల్లోనూ పెరుగదల  రాష్ట్రంలో కూరగాయ ధరల్లో కూడ ఈ సారి పెరుగుల ఉంటుందని వ్యవసాయ మార్కెట్ ఇంటలిజెన్సీ కేంద్రం ప్రిన్సిపల్ ఇన్విస్టిగేటర్ డా.ఆర్ విజయకుమారి వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బోయినపల్లి మార్కెట్‌లో ఆగస్ట్ నుంచి టామాటా పంటకు క్వింటాలు రూ.1400నుంచి 1600 వరకు ధర లభించే అవకాశం ఉంది. అదే విధంగా వంకాయ పంటకు రూ.1440నుంచి 1630, బెండకాయ పంటకు రూ.1650నుంచి 2050 వరకూ ధరలభించే అవకాశాలు ఉన్నాయి. బత్తాయికి మార్చి నుండి గడ్డి అన్నారం మార్కెట్‌లో క్వింటాలుకు రూ.3500నుంచి 3800, జామపంటకు నవంబర్ నంచి రూ.2250నుంచి 2550 వరకు ధరలు లభించే అవకాశాలు ఉన్నట్టు ఇంటలిజెన్సీ కేంద్రం నివేదికలలో వెల్లడించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies