నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వారిని పట్టుకున్న బషీరాబాద్ పోలీస్ సిబ్బంది
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : ప్రజల సమాచారం మేరకు ఎస్.ఐ రమేష్ కుమార్ మరియు సిబ్బంది, బషీరాబాద్ మండల వ్యవసాయ అధికారి వెన్నెల సూర్య ప్రకాష్ కలిసి ఏక్మాయి గ్రామానికి వెళ్ళగా అక్కడ ఇద్దరు వ్యక్తులు తమ చేతులలో రెండు సంచులను కలిగి ఉండి అనుమానంగా ఉండగా వారిని పట్టుకుని విచారణ చేయగా వారి దగ్గర ఉన్న ప్లాస్టిక్ సంచులను తనిఖీ చేయగా అందులో నకిలీ పత్తి విత్తనాలు కలవు, ఈ విత్తనాలు ఎలాంటి గుర్తింపులేని కవర్లలో గలవి దొరికినాయి. ఇవి ఎక్కడివి అని వారిని విచారించగా వారు ఈవి నకిలీ పత్తి విత్తనాలని దౌలతాబాద్ మండలం వీర్లపల్లి గ్రామస్తుడు అయిన వెంకటరాములు దగ్గర నుంచి తీసుకొని వచ్చి బషీరాబాద్ మండల పరిధిలో తెలిసిన అమాయకులైన రైతులకు ఏక్మాయి గ్రామంలో అమ్మడానికి రాగా, ప్రజల సమాచారం మేరకు వారిని పట్టుకున్నారు.బోయింది విఠలప్ప, మరియు చిన్న గుంట వెంకట్రాములు, వీరిరువురు నుండి నాలుగు క్వింటాళ్ల పదిహేను కేజీల (415)కె.జీల నకిళీ విత్తనాలు సీజ్ చేయడం జరిగింది.ఈ నకిలీ పత్తి విత్తనాలను అమాయకులైన రైతులకు అమ్మి, వీటి ద్వారా అధిక దిగుబడి వస్తుందని మాయమాటలు చెప్పి రైతుల నుండి అధిక మొత్తంలో అనగా కేజీకి 1800 రూపాయల చొప్పున అమ్మి, రైతులను మోసం చేస్తూ అధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు.ప్రజలు ఇలాంటి మాయమాటలు చెప్తూ నకిలీ విత్తనాలు అమ్మే వారి గూర్చి పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నారు. ఈ నకిలీ విత్తనాలను వాడి మీరు నష్టపోవద్దు అని హెచ్చరించారు.