నెంబర్ ప్లేట్లు లేని ఎనిమిది బైకులు సీజ్ చేసిన బషీరాబాద్ పోలీస్
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో తాండూర్ డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి ఆదేశాల మేరకు బషీరాబాద్ పోలీసులు వెహికిల్ చెకింగ్ చేస్తూ నెంబర్ ప్లేట్లు లేకుండా నడిచే ఎనిమిది వాహనాలను సీజ్ చేయడం జరిగినది. గత మూడు రోజులుగా ముమ్మరంగా వెహికిల్ చెకింగ్ చేస్తూన్నామని, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను మైనర్ డ్రైవింగ్ చేసే వాహనాలను, మద్యం సేవించి నడీపే వాహనాలను సీజ్ చేస్తామని, ప్రజలందరు నెంబర్ ప్లేట్లు వేయించుకోవాలని బషీరాబాద్ ఎస్సై రమేష్ కుమార్ అన్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా బయటికి వాహనాలను తీసుకురాకూడదని, మైనర్లకు మరియు లైసెన్స్ లేని వారికి యజమానులు తమ వాహనాలను ఇవ్వకూడదని, బషీరాబాద్ మండల ప్రజలకు హెచ్చరిక చేశారు. బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో సంబంధిత యజమానుల సహాయంతో వాహనాలకు నెంబర్ ప్లేట్లు బిగించి, మళ్లీ వారికి అప్పగించడం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపినచో మూడు రోజుల జైలు శిక్షేనని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రమేష్ కుమార్ ఈ సందర్భంగా తెళియజేశారు.