అధికంగా పెరుగుతున్న ఎండా తీవ్రత
* 2-3 డిగ్రీలు పెరిగే చాన్స్
* హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
* అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాగల మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రంవెల్లడించింది. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఆర్లీలో 44.8, ఆసిఫాబాద్ జిల్లా జంబుగలో 44.3, నిర్మల్ జిల్లా కుభీర్‌లో 43.6 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పింది. అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా రాగల రెండు రోజులకు అన్ని జిల్లాలకు అరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక నైరుతి రుతుపవనాలు రాగల 4 రోజుల్లో కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.