జయజయహే రాష్ట్ర గీతాన్ని ఆమోదించిన: రేవంత్ రెడ్డి సర్కార్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 3 చరణాలతో 2.30 నిమిషాల నిడివితో సంక్షిప్త గీతాన్ని రూపొందించినట్లు చెప్పారు. అధికారిక చిహ్నం ఇంకా ఖరారు కాలేదని, తెలంగాణ తల్లి రూపంపైనా అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.