లా సెట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
హైదరాబాద్ Hyderabad Nws భారత్ ప్రతినిధి : తెలంగాణ లాసెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిన్న సాయంత్రం హాల్ టికెట్లు విడుదల చేశారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఇక్కడ పుట్టిన తేదీ, మొబైన్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు. 2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహిస్తోంది. అభ్యర్థులు 3 సంవత్సరాల లా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్ అభ్యర్థులు 45%, ఓబీసీ 42% , ఎస్సీ,ఎస్టీలు 40% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి.
5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ 45%, OBC 42%, ఎస్సీ, ఎస్టీ 40% శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించాలి. లా కోర్సుల్లో ప్రవేశాలకు వయోపరిమితి లేదు.తెలంగాణ లాసెట్ ప్రవేశ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. ఎల్ఎల్ బీ ఐదేళ్లు, మూడేళ్ల కోర్సులకు వేర్వురు ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఎల్ఎల్ఎం కు కూడా ప్రత్యేక ప్రశ్నాపత్రం ఉంటుంది. మూడు సెషన్లలో పరీక్షలు జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలు జరుగు తాయి. ఉదయం 9 నుంచి 10.30 వరకు మొదటి సెషన్ ఉంటుంది.మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్ జరుగుతుంది.తొలి రెండు సెషన్లలో మూడేండ్ల లా కోర్సు ప్రవేశాలకు పరీక్షను నిర్వహిస్తారు. చివరి సెషన్‌లో ఐదేళ్ల లా కోర్సు, పీజీఎల్‌సెట్ పరీక్షలు ఉంటాయి.