పార్టీకి విరుద్దంగా పనిచేసిన ఇద్దరు నాయకులపై వేటు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కార్యకలాపాలకు విరుద్దంగా పనిచేసిన బషీరాబాద్ మండల కాంగ్రెస్ నాయకుడిపై జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ వేటు వేసింది. ఈ సందర్బంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేసారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం కొర్విచెడ్ గ్రామానికి చెందిన యూత్ ప్రభంజనం అధ్యక్షుడు శ్రీనివాస్ సోషల్ మీడియాలో పార్టీకి విరుద్దంగా పోస్టులు పెడుతూ,పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించారని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. శ్రీనివాస్ తో పాటు తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డె శ్రీనివాస్ పై కూడా వేటు పడినట్టు పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.