జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈలోగా పగటి ఉష్ణోగ్రతలు మరికొంత పెరగొచ్చని పేర్కొన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని విమరించారు. ప్రస్తుతం పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండంతో గురువారం రాష్ట్రంలో చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.