పి.శ్రీనివాస్ పై దాడి చేసిన కానిస్టేబుల్ సత్తార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి : పీడీఎస్‌యూ గీత
* అతడికి వత్తాసు పలికిన ఎస్సై కాశీనాథ్ ను వెంటనే సస్పెండ్ చేయాలి
* ప్రజా సంఘాలు ,విద్యార్థి సంఘాల డిమాండ్
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ లో నిన్న సాయంత్రం PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ స్థానిక తాండూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వస్తే అకారణంగా బూతులు తిడుతూ ఫిర్యాదు రాయనీయకుండా, కొడుతూ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లిన కానిస్టేబుల్ సత్తార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, అతడికి వత్తాసు పలికిన ఎస్సై కాశీనాథ్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక DSP గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు నాయకులు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక విద్యార్థి సంఘ నాయకుడు పైన ఇలాంటి దాడులు జరిపితే తాండూర్ పట్టణంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అని ఇదెక్కడి ప్రజాస్వామ్యాన్ని తెలియజేయడం జరిగింది. ప్రజలకు బాధలు కలుగుతే సమస్యలు ఎదురైనప్పుడు పోలీస్ స్టేషన్కు రాకపోతే మరి ఇంకెక్కడికి వెళ్లాలని పోలీసు ఉన్నత అధికారులే తెలపాలని తెలియజేయడం జరిగింది.
ఇప్పటికైనా విద్యార్థి నాయకుల పైన దాడి చేసిన కానిస్టేబుల్ సత్తార్ ను మరియు అతడికి వత్తాసు పలికిన ఎస్సై కాశీనాథను వెంటనే 24 గంటల్లో విచారణ జరిపి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. లేదంటే జిల్లా వ్యాప్తంగా ప్రజాసంఘాలు విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని న్యాయమైన పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో CITU జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్, తెలంగాణ జన సమితి నాయకులు, కౌన్సిలర్ సోమశేఖర్ ,తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎర్రన్ పల్లి శ్రీనివాస్,POW జిల్లా నాయకులు గీతా మహేందర్, IFTU జిల్లా నాయకులు మహేందర్,ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కొత్తూరు చంద్రయ్య, స్వేరో జిల్లా ఉపాధ్యక్షులు శివ, తెలంగాణ ప్రైవేటు లెక్చరర్ ఫోరం అధ్యక్షుడు పర్యాద రామకృష్ణ, విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఇంచార్జ్ అశోక్ , ప్రైవేటు మరియు జేఏసీ , ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు సంజయ్ గౌడ్ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, జై భీమ్ తాండూర్ డివిజన్ నాయకులు, విద్యార్థి నాయకులు దీపక్ రెడ్డి ,వెంకట్, అనిల్, చెన్నప్ప, సిపిఎం సిపిఐ నాయకులు , సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు మల్లేష్ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.