ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఈనెల 12న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం
అమరావతి Amaravathi News భారత్ ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధి కారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈనెల 12న కొలువుదీరనుంది. జూన్9 న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందుగా డేట్ ఫిక్స్ చేయగా.. ప్రధాని మోడీ ప్రమాణస్వీకారో త్సవం నేపథ్యంలో 12కు వాయిదా వేశారు.ఎన్డీయే మిత్రపక్షాలు కూడా ప్రమాణస్వీకారానికి హాజర య్యే అవకాశాలున్నాయి. అయితే గతంలో అమరా వతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్ల డించగా.. వేదికపై పూర్తిస్థా యి క్లారిటీ అయితే రాలేదు. ఇవాళ వేదికపై టీడీపీ నేత లు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఏపీలో ఎన్డీయే కూటమి భారీ విజ యాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గానూ టీడీపీ – 136 , జనసేన – 21, బీజేపీ – 8 మొత్తం 165 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది.