Type Here to Get Search Results !

Sports Ad

అడుగడుగునా బలగాలు కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ 144 section near the counting centers of forces at every step

 అడుగడుగునా బలగాలు కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌

* 90వేల మంది భద్రతా బలగాలు 
* ఏపీలో కౌంటింగ్‌కు దాదాపు 90వేల మందిని మోహరించింది ఈసీ
* సుమారు 60వేల మంది సివిల్‌ పోలీసులను
* 8వేల మంది సాయుధ బలగాలను 
* మరో 20వేల మంది సిబ్బందిని రంగంలోకి దించింది

ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh News భారత్ ప్రతినిధి : గీత దాటితే తాట తీసుడే.. నిఘా నీడలో ఆంధ్రప్రదేశ్.. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో కర్ణాటక పోలీసులు, సెంట్రల్ ఫోర్స్ దేశవ్యాప్తంగా కౌంటింగ్‌ రేపు జరగనుంది.. సాయంత్రం నాటికి పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది.. అియతే.. ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసతో ఏపీవ్యాప్తంగా పెద్దఎత్తున కేంద్ర బలగాల మోహరించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్భంధీగా చర్యలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నారు. అంతేకాకుండా.. సీఎం జగన్‌, చంద్రబాబు నివాసాలు, పార్టీల ఆఫీసుల దగ్గర భద్రత పెంచారు. ఏపీవ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించి.. రౌడీషీటర్ల బైండోవర్‌, పలువురిపై నగర బహిష్కరణ వేటు వేశారు. 

   సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్‌ తర్వాత కూడా 20 కంపెనీల బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ రోజున జరిగిన అల్లర్లు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. 90వేల మంది భద్రతా బలగాలు ఏపీలో కౌంటింగ్‌కు దాదాపు 90వేల మందిని మోహరించింది ఈసీ.సుమారు 60వేల మంది సివిల్‌ పోలీసులను 8వేల మంది సాయుధ బలగాలను మరో 20వేల మంది సిబ్బందిని రంగంలోకి దించింది.  45వేల 960మంది ఏపీ స్టేట్‌ పోలీసులకు తోడుగా 3500మంది కర్నాటక పోలీసులు, 4500మంది తమిళనాడు పోలీసులు రేపు బందోబస్తులో ఉండనున్నారు. అలాగే, 1622మంది హోంగార్డులు, 3366మంది ఇతర పోలీస్‌ సిబ్బంది కౌంటింగ్‌ సెక్యూరిటీ విధుల్లో ఉంటారు. వీళ్లకు తోడుగా మరో 18,609మందిని మోహరించింది ఈసీ. ఇందులో 3010మంది ఎన్‌సీసీ, 13వేల739మంది ఎన్‌ఎస్‌ఎస్‌ సిబ్బంది, 1614మంది ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, 246మంది రిటైర్డ్‌ పోలీస్‌ సిబ్బంది విధుల్లో ఉంటారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies