Type Here to Get Search Results !

Sports Ad

కౌంటింగ్ కు సర్వం సిద్ధం: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు All set for counting: Implementation of Section 144 across the state

 కౌంటింగ్ కు సర్వం సిద్ధం: రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

హైదరాబాద్‌  భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సహా 525 మంది పోటీలో ఉన్నారు. 2,20,24,806 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా తోపాటు, మూడంచెల భద్రత ఉంటుందని అధికారులు తెలిపారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్, మద్యం దుకాణాల బంద్ అంటుందిని చెప్పారు.120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లు సాయంత్రం 4 వరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పెద్దపెల్లి జిల్లా పరిధిలోని జేఎన్టీయూ కాలేజీ లో రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. చొప్పదండి, దేవరకొండ, యాఖుత్‌పురా,అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కింపు ఓట్ల లెక్కింపునకు సుమారు 10 వేల మంది సిబ్బంది నియామకం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies