Type Here to Get Search Results !

Sports Ad

ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి Two lakh loan waiver before August 15: Minister Komati Reddy Venkat Reddy

 ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : అతి త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మంత్రి మీడియా తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ను విమర్శించే అర్హత హరీష్ రావుకు ఏమాత్రం లేదని మండిపడ్డారు. ఆగష్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా మని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడు తోందని చెప్పారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో కోట్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, విద్య గురించి కేసీఆర్ తన పాలనలో ఏ రోజూ పట్టించుకోలేద న్నారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూశారన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies