Type Here to Get Search Results !

Sports Ad

జూన్ 18న, రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధుల జమ On June 18, PM Kisan funds were deposited in farmers' accounts


జూన్ 18న, రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధుల జమ


కేంద్రం Central News భారత్ ప్రతినిధి : దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ సర్కార్ 3.0 పెద్ద శుభవార్త చెప్పింది. ఈ సారి ముందుగా ప్రధాని తన ప్రస్థానాన్ని రైతులకు మేలు చేసే కార్యక్రమం నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత సొమ్ము జమ కోసం నిరీక్షణకు తెరపడనుంది. కేంద్రంలో ఎన్‌డీఎ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే, రైతుల కోసం తదుపరి విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని మంజూరు చేసే ఫైలుపై సంతకం చేశారు. దీంతో కోట్ల మంది రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. తాజాగా వారి ఖాతాల్లో డబ్బు జమకు సంబంధించిన తేదీ వివరాలు వెలువడ్డాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ 18, 2024న మొత్తం దాత ఖాతాలో జమ చేయబడుతుందని సమాచారం. ప్రధాని మోదీ జూన్ 18న వారణాసిలో పర్యటిస్తుండగా.. అక్కడి నుంచి DBT ద్వారా దేశంలోని 9.3 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు 20,000 కోట్లు బదిలీని పరిశీలిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి.. పీఎం కిసాన్ యోజన అనేది పేద రైతుల సంక్షేమం కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన స్కీమ్. రైతు బంధు పేరుతో తెలంగాణలో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని దేశవ్యాప్తంగా రైతులకోసం మోదీ విస్తరించారు. పిఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తాన్ని అందుకోవడానికి లబ్దిదారుడు రైతుల ఆధార్ కార్డు తప్పనిసరిగా వారి బ్యాంకు ఖాతాతో అనుసంధానించబడి ఉండాలి. ఈ పథకాన్ని పొందేందుకు eKYC, యాక్టివ్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అవసరం. ఈ ప్రభుత్వ పథకంలో భూమి ధృవీకరణ కూడా ఒక ముఖ్యమైన ప్రక్రియ. జాబితాలోని పేరును తనిఖీ చేయడానికి రైతులు ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in ని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ హోమ్ పేజీలో 'బెనిఫిషియరీ లిస్ట్' ట్యాబ్‌పై క్లిక్ చేసి.. రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను పూరించి రిపోర్ట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ స్క్రీన్‌పై లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీరు మీ పేరును తనిఖీ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తల కోసం... 
* ప్రవేశ పరీక్షలో మండల టాపర్గా శులామిటే సుజన్ ఇక్కడ క్లిక్ చేయండి
* డెంగ్యూ జ్వరం రాకుండా ఉండడానికి ఈ విధంగా చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
 * రుణమాఫీ కొందరికే ఇక్కడ క్లిక్ చేయండి
* జూన్ 18న, రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధుల జమ ఇక్కడ క్లిక్ చేయండి
*  నేడు ఐసెట్‌ ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* కళాజాత బృందం, పలు చట్టాలపై అవగాహన కార్యక్రమం ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies