జూన్ 25న తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ డు సప్లిమెంటరీ ఫలితాలు...
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన వారు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. వీరంతా కూడా ఫలితాలను బట్టి ఇంజినీరింగ్ లేదా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫలితాలు ఎప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తున్నారు.గత పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీకోడింగ్, ఆన్‌లైన్‌లో మార్కుల ఎంట్రీ పూర్తైంది. ఏవైనా అనివార్య పరిస్థితులు ఏర్పడితే ఈ నెల 26 లేదా 27న విడుదల చేస్తారు. తెలంగాణలో మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలు ఇలా చూసుకోండి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీరు ఏ ఇయర్ పరీక్ష రాశారో అక్కడ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి… మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి. సబ్మిట్ బటన్ పై నొక్కితే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు. ఫలితాలు ఇలా చూసుకోండి సబ్మిట్ బటన్ పై నొక్కితే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.