26 ఏళ్లకే ఎంపీగా ప్రమాణం చేసిన దళిత మహిళ
న్యూఢిల్లీ New Delhi News భారత్ ప్రతినిధి : రాజస్థాన్‌లోని దళిత కుటుంబానికి చెందిన మహిళ రాజకీయాల్లోకి రావడం విశేషం. అలాంటిది 26 ఏళ్ల సంజనా జాతవ్ ఎంపీగా గెలిచి కుటుంబ సమేతంగా పార్లమెంటుకు వచ్చారు. తన తల్లి, అత్తమామల ఆశీస్సులు తీసుకున్న తర్వాత భరత్‌పూర్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.రాజకీయాల్లోకి వచ్చేలా అత్తమామలను ఒప్పిం చారని, ఎమ్మెల్యేగా ఓడిపోయినా కాంగ్రెస్ తనను నమ్మి లోక్‌సభ టిక్కెట్ ఇప్పించిందని ఆమె అన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.