ఉద్యమకారులను ఆదుకోవాలి ..!
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : న్యూస్లైన్ డెస్క్ స్టొరీ ; ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పాడుపడిన తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారుల సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మస్కు మహేష్ డిమాండ్ చేశారు.గుమ్మడవెళ్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కాలికి గజ్జ కట్టి.. గోసి గొంగడేసి గ్రామ గ్రామాన తిరిగి ధూంధాం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రజలను మరింత చైతన్యం చేసినట్లు గుర్తుచేశారు. తమ కష్టాన్ని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేవలం రాజకీయ నాయకులు బాగుపడ్డారు తప్ప.. ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం చేకూరడం లేదన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి ఆదుకోవాలన్నారు.ఉద్యమకారులు ధన్నారం జంగయ్య, శివకుమార్, కిరణ్‌కుమార్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.