ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన ఏడిఏ రుద్ర మూర్తి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా
బషీరాబాద్ మండలంలో శుక్రవారం రోజున తాండూరు వ్యవసాయ సంచాలకులు ఏడిఏ రుద్ర మూర్తి ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి. విత్తనాలు రైతులకు పంపిణీ చేసేటప్పుడు రసీదు ఇవ్వాలి. ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్ నమోదు చేసి బోర్డు పై వ్రాయాలి ఈపాస్ మిషన్ లో నమోదు చేయాలని పేర్కొన్నారు. లేదంటే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. నకిలీ విత్తనాల గురించి రైతులకు అవగాహన కల్పించమని, బిల్లు రసీదు లేని నాసరికం విత్తనాలు విక్రయించిన కొనుగోలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సూర్యప్రకాష్, ఏఇఒ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.