బాల్యం పై పుస్తకాల భారం The burden of books on childhood
Bharath NewsJune 24, 2024
0
బాల్యం పై పుస్తకాల భారం?
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి :నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులపై మళ్లీ బ్యాగు భారం మొదలైంది. అడుతూ పాడుతూ చదువుకో వాల్సిన వయసులో పుస్తకాల భారం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఏటా పై తరగతికి వెళ్తుంటే పుస్తకాల సంఖ్య కూడా పెరుగుతోంది.ప్రైవేటు స్కూళ్లలో పిల్లలు బ్యాగు నిండా పుస్తకాలతో నాలుగైదు అంతస్తుల మెట్టు ఎక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఫలితంగా పట్టుమని 15 ఏళ్లు నిండక ముందే చాలా మంది నడుము,మెడ నొప్పి,కండరాల సమస్యలతో సతమతమవుతున్నారు.విద్యార్థులకు గుణాత్మక నైపుణ్యత విద్యను అందించాలని విద్య హక్కు చట్టం చెబుతున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం పట్టించుకునే పాపాన పోలేదు.పుస్తకాల భారం తగ్గించాలని,2006లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన ప్పటికీ, వాటిని అమలు చేయడం లేదు దీంతో విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు.