కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన
కుప్పం Kuppam News భారత్ ప్రతినిధి : నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రెండో రోజు కుప్పంలో కొనసాగుతుంది. ఆర్అండ్‌బీ అతిధి గృహం వద్ద ప్రజల నుంచి చంద్రబాబు వినతులను స్వీకరించారు. చంద్రబాబుకు తమ సమస్యలను చెప్పుకునేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చారు. మహిళలు, వృద్ధులు తరలిరావడంతో అందరి నుంచి చంద్రబాబు వినతి పత్రాలను స్వీకరిం చారు. వాటిని స్వయంగా పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో అతిథి గృహంకిక్కిరిసింది.