మెగా టెక్స్‌టైల్ పార్కులో మొక్కలు నాటిన సీఎం రేవంత్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలోని మెగా టెక్స్ టైల్ పార్క్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సీఎంకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. వన మహోత్సవంలో భాగంగా మెగా టెక్స్‌టైల్ పార్కులో సీఎం మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. హనుమకొండలో మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై సమీక్షించనున్నారు.