డెంగ్యూ జ్వరం రాకుండా ఉండడానికి ఈ విధంగా చేయండి
ఆరోగ్యం Health : డెంగ్యూ జ్వరం వస్తే తీసుకోవడానికి వ్యాక్సిన్ లేదు. ఒకవేళ కనుక డెంగ్యూ బారిన పడితే ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి డెంగ్యూ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు దోమలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సమయంలో డెంగ్యూ జ్వరం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వర్షాల వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి.
* అసలు ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి How to identify this disease
దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. అనేక పట్టణాల్లో డెంగ్యు తీవ్రత ఎక్కువగా వుంది అని డాక్టర్లు గుర్తించారు.ముఖ్యంగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా డెంగ్యూతో బాధ పడే వాళ్ళు ఉంటున్నారు అని వెల్లడించారు. అయితే ఇటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక వేళ వస్తే ఎటువంటి లక్షణాలు కనపడతాయి ..? అనేది కూడా మనం తెలుసుకుందాం!
* డెంగ్యూ వలన కలిగే లక్షణాలు Symptoms caused by dengue
డెంగ్యూ వ్యాపించిన నాలుగు నుండి ఆరు రోజులకి లక్షణాలు కనబడతాయి. ఆ లక్షణాలు పది రోజుల పాటు ఉంటూనే ఉంటాయి. హఠాత్తుగా జ్వరం ఎక్కువై పోవడం, తీవ్రమైన తలనొప్పి రావడం, కళ్ళల్లో నొప్పి కలగడం, ఎముకల నొప్పి, జాయింట్లలో నొప్పి కలగడం, నీరసం, వాంతులు, శ్వాస తీసుకో లేక పోవడం, చర్మంపై ర్యాషెస్ ఇలాంటివి రావడం, ముక్కు దంతాల నుండి రక్తం కారడం ఇటువంటి లక్షణాలు డెంగ్యూ వ్యాపించినప్పుడు కనపడతాయి.ఒక వేళ కనుక మీకు ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి ఎందుకు అంటే ఏదైనా సమస్య ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. దానిని నిర్లక్ష్యం చేసే కొద్దీ పెద్దదై పోతుంది. కాబట్టి లక్షణాలని గుర్తిస్తే సరైన సమయానికి మెడికెషన్ తీసుకోవడం చాలా ముఖ్యం.
కొన్ని కొన్ని సార్లు లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే అప్పుడు సరైన సమయానికి ట్రీట్మెంట్ తీసుకోవడం కుదరదు. అలాంటప్పుడు ప్రమాదం మరింత ఎక్కువ అవుతుందని డాక్టర్లు అంటున్నారు. తీవ్రమైన జ్వరం, బ్లడ్ వెసల్స్ డామేజ్ అవ్వడం, ముక్కు మరియు దంతాలలో రక్తం కారడం, లివర్ ఎన్లార్జ్మెంట్ అవ్వడం, సర్క్యులేటరీ సిస్టం ఫెయిల్ అవ్వడం వంటి కారణాల వల్ల ఎక్కువ బ్లీడింగ్ అవడం, షాక్‌కి గురి అవ్వడం, చనిపోవడం లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.దీనిని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ డిఎస్ఎస్ అనిఅంటారు.రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే వాళ్లలో ఎక్కువ ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెప్పడం జరిగింది.అదే విధంగా జ్వరం కూడా వాళ్లలో వస్తుందని దీని రిస్కు కూడా ఎక్కువ అవుతుందని చెప్పారు. డయాగ్నోసింగ్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ బ్లడ్ టెస్ట్ చేసి డాక్టర్లు డెంగ్యూ వైరస్ ఉందో లేదో చెప్తారు. దీంతో ముందు అసలు డెంగ్యూ ఉందా లేదా అనేది తెలుస్తుంది.
* డెంగ్యూ ట్రీట్మెంట్ Dengue Treatment
డెంగ్యూ ఇన్ఫెక్షన్ వస్తే సరిగ్గా ఇదే మందు వాడాలి అని రూల్ లేదు. డెంగ్యూ జ్వరం ఉంటే పారాసిటమాల్ కూడా వేసుకోవచ్చు. దీంతో జ్వరం తగ్గుతుంది. అయితే డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు వీటిని వాడటం మంచిది కాదు.ఎందుకంటే, దీని కారణంగా బ్లీడింగ్ మరింత ఎక్కువ అవుతుంది. అదే విధంగా ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడంమంచిది. మీకు కనుక దీని యొక్క తీవ్రత 24 గంటల్లోగా ఎక్కువ అయితే మీరు అప్పుడు ఆసుపత్రిని తప్పక కన్సల్ట్ చేయాలి.చెకప్ చేయించుకోవడం కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో లేదో పరీక్షించుకోవడం చాలా అవసరం.
* డెంగ్యూ రాకుండా ఉండడానికి ఈ విధంగా చేయండి Do this to avoid dengue
డెంగ్యూ జ్వరానికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు కాబట్టి దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కాబట్టి మీ ఇంటి ఆవరణలో, మీ ఇంట్లో శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి. దోమలు కుట్టడం వలన డెంగ్యూ వస్తుంది అని గుర్తించి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు దోమలు కుట్టకుండా చూసుకోండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా అనుసరించండి.. మీరు కనుక ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా డెంగ్యూ బారిన పడకుండా ఉండటానికి వీలవుతుంది. ఎక్కువ జనం ఉండే ప్రదేశాల లో ఉండటం మంచిది కాదు. మీకు వీలైతే వాళ్ల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దోమలు కుట్టకుండా ఉండడానికి క్రీమ్ రాసుకోవడం, దోమలు మీ ఇంట్లో ఉండకుండా ఉండడానికి దోమల మందు, లిక్విడ్స్ లాంటివి వాడడం చేయండి. దీని వల్ల దోమలు మీ దరిచేరకుండా ఉంటాయి.బయటకు వెళ్ళినప్పుడు పొడవు చేతులు ఉండే షర్ట్, కుర్తీస్ లాంటివి వేసుకోండి. అదే విధంగా సాక్సులు కూడా ధరించి వెళ్ళండి. దీనితో కాళ్ళకి, చేతులకి దోమలు కుట్టకుండా ఉంటాయి. ఇంట్లో మస్కిటో నెట్స్ వంటివి వాడండి. దీని వల్ల దోమలు కుట్టకుండా మీరు జాగ్రత్త పడొచ్చు.మీకు ఒక వేళ కనుక డెంగ్యూ తాలూక లక్షణాలు ఉంటే తప్పకుండా డాక్టర్‌తో మాట్లాడండి దీని వల్ల ఏమైనా ప్రమాదం ఉంటే ముందుగానే తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకో వచ్చు. అదే విధంగా దోమలు ఎక్కువగా సంచరించే చోట్ల నుండి నీళ్లు
తెచ్చుకోవడంలాంటివి మానేయండి.మన ఇంట్లో పాత సామాన్లు ముఖ్యంగా పాత టైర్లు, క్యాన్స్, పూల కుండీలు మొదలైన వాటిలో నీళ్లు ఎక్కువగా చేరిపోతాయి. వీలైనంతవరకు పాత సామాన్లని నీళ్ళు తగలకుండా ఉంచుకోండి.లేదు అంటే అక్కడ దోమలు ఎక్కువగా చేరుతాయి. దీని వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి.మీ ఇంట్లో వాడే కూలర్‌లో నీళ్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ఇంట్లో పెంపుడు జంతువులకు ఉపయోగించే డిష్‌లో నీళ్లు ఎక్కువగా చేరుతాయి. వాటిని కూడా శుభ్రంగా పొడిగా ఉంచుకోవడం మంచిది. లేదు అంటే వీటి వల్ల కూడా దోమలు చేరి డెంగ్యూకి కారణమవుతాయి. ఒకవేళ కనుక మీ ఇంట్లో ఎవరైనా డెంగ్యూ బారిన పడితే అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు మీరు కూడా సురక్షితంగా ఉండాలి. దోమలు కుట్టకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చూసారా డెంగ్యూ వల్ల కలిగే ఇబ్బందులు వస్తాయో. కాబట్టి ముందు గానే జాగ్రత్తలు తీసుకుంటే అంతటి పెద్ద ప్రమాదం మీకు ఉండదు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. దోమలే కదా అని లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించాలి. కాబట్టి ఈ లక్షణాలు గుర్తించడం నిపుణులు చెప్పిన ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.