మున్సిపల్ కార్మికుల విధుల బహిష్కరణ
ఇల్లందు మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం ఉదయం విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారు. ఇల్లందు మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం ఉదయం విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారు. ఇప్టు, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. పీఆర్సీ ఏరియర్స్ బకాయిలు, రెండేళ్ల పీఎఫ్ బకాయిలు, మేడే కానుక బకాయిలు చెల్లించాలని కోరుతూ సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్న తమ సమస్యల పరిష్కారానికి పాలకులు, అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.