Type Here to Get Search Results !

Sports Ad

గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయండి Fill teacher posts in gurukula schools


 గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయండి 

తెలంగాణ Telangana News : రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమైన విషయమని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు మండిపడ్డారు. మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సిఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మోకాళ్ళ మీద నిలబడి ఎన్నిసార్లు అభ్యర్థించినా అభ్యర్థుల మొర అలకించకపోవడం బాధకు గురి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. పేద,బడుగు,బలహీన వర్గాల పిల్లలకు అత్యున్నత,నాణ్యమైన రెసిడెన్షియల్ తో కూడిన విద్యను పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసిందని,అన్నారు.

టీచర్ల కొరత లేకుండా చేసి,విద్యా ప్రమాణాలు మరింత పెంచేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 9210 టీచర్ పోస్టుల భర్తీకి గత బిఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.నిరుద్యోగులకు నష్టం జరగకుండా ఉండాలని, ఒక్క పోస్ట్ కూడా మిగిలిపోవద్దనే లక్ష్యంతో ఉన్నత హోదా పోస్టుల నుండి ప్రారంభించి కింది స్థాయి పోస్టుల వరకు ఫలితాలు వెల్లడించి భర్తీ చేయాలని నిర్ణయించిందని హరీష్ రావు తెలిపారు.

అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందుకు భిన్నంగా వ్యవ హరించడం వల్ల ఒకే అభ్య ర్థికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం జరిగిందని. దీనివల్ల దాదాపు 2500 పైగా టీచర్ పోస్టులు మిగిలిపోయాయని. అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని,ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బ్యాక్ లాగ్ పోస్టులు ఆపవద్దన్నారు.తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి అభ్యర్థులకు,నిరుద్యోగులకు న్యాయం చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies