కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి: హైదరాబాద్ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఈరోజు ఉదయం ఆందోళన చేపట్టాయి.నీట్ పరీక్షను రద్దు చేయా లనే డిమాండ్‌తో పలు సంఘాల నేతలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారుఈ క్రమంలో ఆయనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీసు స్టేషన్‌కు తరలించారు.