గృహజ్యోతి కొందరికే
* బషీరాబాద్ కరెంట్ జీరో బిల్లులకు ఎంపిక కాని వారు 2,439 మంది
బషీరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం అందరికీ అందడం లేదు. తెల్ల రేషన్ కార్డు ఉండి నెలకు 2 యూనిట్ల లోపు కరెంటు వినియోగించేవారు ఈ పథకానికి అర్హులు. బషీరాబాద్ మండలంలో గృహ విద్యుత్ వినియోగదారులు 6,930 మంది ఉండగా వీరిలో 4,491 మందిని గృహ జ్యోతి పథకానికి ఎంపిక చేశారు. ఫిబ్రవరి నుంచి అమలు చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ తో అమలు కాలేదు. ప్రస్తుతం కోడ్ ముగియడంతో అందరికీ వర్తించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తులు స్వీకరిస్తున్నాం గృహ జ్యోతి పథకానికి ఎంపిక కాని అర్హుల నుంచి మరోసారి ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొదట ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తుకు సంబంధించిన రసీదు తీసుకెళ్లి చూపిస్తే మరోసారి దరఖాస్తు ఇస్తారు. అందులో యజమాని పేరు విద్యుత్ మీటర్ సర్వీస్ నెంబర్ రేషన్ కార్డు నెంబర్ను నింపాలి. రషీద్ విద్యుత్ అధికారులకు ఇస్తే అర్హులకు జీరో బిల్లుల కోసం అప్లోడ్ చేస్తామని ట్రాన్స్ కో మెహనకృష్ణారెడ్డి తెలిపారు.