Type Here to Get Search Results !

Sports Ad

గృహజ్యోతి స్కీమ్.ఆన్ లైన్ పొరపాట్లతో పలువురికి కరెంట్ బిల్లులు వస్తున్న తీరు Gruhajyoti scheme.. How many people are getting current bills due to online mistakes

గృహజ్యోతి స్కీమ్.ఆన్ లైన్ పొరపాట్లతో పలువురికి కరెంట్ బిల్లులు వస్తున్న తీరు 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఆన్ లైన్ చేసేటప్పుడు జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల జీరో బిల్ పొందడానికి అర్హులైన కూడా వారికి కరెంటు బిల్ వస్తుంది. ఆన్ లైన్ చేసేటప్పుడు జరిగిన కొన్ని పొరపాట్లు సరిచేయడానికి ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో గృహజ్యోతి స్కీమ్ అందక కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అన్ని అర్హతలు కలిగి ఉండి స్వంత ఇళ్ళు ఉన్నవారికి కూడా గృహ జ్యోతి పథకంలో భాగంగా సున్నా బిల్లు రావడం లేదు. ఎందువలన అని ఆరా తీయగా ప్రజాపాలన అప్లికేషన్ లో విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఆప్షన్ లో కొంత మంది మీటర్ సర్వీస్ నెంబర్ ను కొంతమంది USC నెంబర్ ఇచ్చి కరెంటు బిల్లు జిరాక్స్ కాపీని కూడా జతచేయగా డాటా ఎంట్రీ సిబ్బంది USC నెంబర్ ఎంట్రీ చేసిన వారికి జీరో బిల్లు వస్తుంది SC నెంబర్ వేసిన వారికి అన్నీ మ్యాచ్ 

   అయినట్లుగా చూపించినా కూడా జీరో బిల్లు రావడం లేదు. ఎడిట్ ఆప్షన్ మాకు లేదు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎడిట్ ఆప్షన్ వస్తేనే సవరించడానికి వీలుంటుందని చెబుతున్నారు. ఇంకా కొంతమంది కికారణాలు చూస్తే అద్దె ఇళ్లలో ఉండే వారు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడు ఈ స్కీంను పొందడం సమస్యగా మారింది. ప్రజాపాలన దరఖాస్తులో ఏ మీటర్ నంబర్ అయితే రాశారో, అదే నంబర్కు జీరో బిల్ వర్తిస్తుందని, మీటర్ నంబర్ను మార్చుకునే ఆప్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో అద్దె ఇల్లు మారిన లబ్ధిదారుకు స్కీమ్ అందడం లేదు. పాత ఇంటి మీటరునే గృహజ్యోతి వర్తిస్తుండడంతో ఇంటి ఓనర్ లబ్ధి పొందుతున్నారు. ఇక ప్రజాపాలన దరఖాస్తు చేసే సమయంలో జరిగిన పొరపాట్ల వల్ల మరికొంత మంది పథకానికి దూరమయ్యారు. 

మరిన్ని వార్తల కోసం... 
* గృహజ్యోతి స్కీమ్.ఆన్ లైన్ పొరపాట్లతో పలువురికి కరెంట్ బిల్లులు వస్తున్న తీరు ఇక్కడ క్లిక్ చేయండి 
* అద్భుతమైన పాలసీ పెళ్లికి రూ.26 లక్షలు ఇక్కడ క్లిక్ చేయండి 
* జులై 1 నుంచి కొత్త చట్టాలు అమలు ఇక్కడ క్లిక్ చేయండి 
* పెర్‌ఫ్యూమ్ వాడితే ఈ నష్టాలు ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణలో ప్రతి ఊరికో మీ సేవా కేంద్రం ఇక్కడ క్లిక్ చేయండి 
* ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
* నేడే T20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు ఇక్కడ క్లిక్ చేయండి 
* రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies