అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు
బషీరాబాద్ న్యూస్ భారత్ ప్రతినిధి: అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు బషీరాబాద్ మండలంలో ఈ రోజు విశ్వాసనీయ సమాచారం మేరకు మైల్వార్ గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెలుసుకున్న ఎస్సై రమేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి ట్రాక్టర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని రావడం జరిగింది. ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మైల్వార్ గ్రామానికి చెందిన శామప్ప అనే వ్యక్తి ట్రాక్టర్ నెంబర్ టియస్ 34 బి 0631 గల దానిపై ఇసుక తరలిస్తుండగా బషీరాబాద్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించామాని ఎస్సై రమేష్ కుమార్ తెలిపారు.