ఇంటర్ ఫెయిల్ ఇద్దరు విద్యార్థినీలు ఆత్మహత్య
కరీంనగర్ Karimnagar News భారత్ ప్రతినిధి : ఇంటర్ ఫెయిల్ ఇద్దరు విద్యార్థినిలు సూసైడ్మ నస్థాపంతో ఇద్దరు ఇంటర్ విద్యార్థినీలు ఆత్మహత్య చేసుకున్నారు.సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల సోనీ(17) నిన్న ప్రకటించిన ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఇది ఇలా ఉండగా.కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి చెందిన శ్యామల వైష్ణవి(17) ఇటీ వల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది.దీంతో మనస్థాపం చెంది ఈనెల 2న పురుగుల మందు తాగింది.చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది.