బీసీ హాస్టల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఫ్రీ మెట్రిక్ బీసీ వసతి గృహాల్లో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బషీరాబాద్ బీసీ బాలికల వసతి గృహం వార్డెన్ స్వప్న తెలిపారు. బీష్టి హాస్టల్లో 3 నుంచి 10వ తరగతి వరకు 82 సీట్లు ఖాళీగా ఉన్నాయని అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బోనఫైడ్, కులం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, మార్కుల జాబితాతో, మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.