బషీరాబాద్ మండలంలోని జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని జూనియర్ కళాశాలలో ప్రవేశానికి బాల, బాలికల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ నరసింహారెడ్డి తెలిపారు. జడ్పీ బాలుర పాఠశాల భవనంలో కొత్తగా కాలేజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటర్లో తెలుగు ఆంగ్ల మధ్య మాలో బోధన ఉంటుందన్నారు. ఎంపీసీ, బైపిసి, సిఈసి, హెచ్ఈసి, ఎంపిహెచ్డబ్ల్యూ, ఒకేషనల్ కోర్సులు ఉంటాయని అన్నారు. ఈనెల 30 లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.