Type Here to Get Search Results !

Sports Ad

కళాజాత బృందం, పలు చట్టాలపై అవగాహన కార్యక్రమం Kalajata team, awareness program on various laws

కళాజాత బృందం, పలు చట్టాలపై అవగాహన కార్యక్రమం  

* బాల్య వివాహాలు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం ఎస్సై రమేష్ కుమార్

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతటి గ్రామంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు గురువారం రాత్రి బషీరాబాద్ ఎస్సై రమేష్ కుమార్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కళాబృందం వివిధ సామాజిక అంశాలపై మండలంలోని మంతటి గ్రామంలో కళాబృందంచే బాల్య వివాహాల నిర్మూలన సైబర్ నేరాలు, ట్రాఫిక్ చట్టాలు, డ్రంకెన్ డ్రైవ్, డయల్ 100, మూఢనమ్మకాలపై మాటల ద్వారా, పాటల రూపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాబృందం వారు మాట్లాడుతూ బాల్య వివాహాలతో అమ్మాయిలు ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం కోల్పోతున్నారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రత్యేక చట్టం ఉందని వివరించారు. గ్రామాల్లో బాల్యవివాహాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 1098 నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు. మరియు ఎవరైనా పోకిరిలు బాలికలను వేధిస్తే కఠినమైన చట్టాలు ఉంటాయని పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీకు లోన్ ఇస్తామని తక్కువ ధరకే ఆన్లైన్లో వస్తువులు వస్తాయని ఇలా అనేక రకాలుగా మోసాలు జరుగుతాయని కాబట్టి ఎవరైనా అపరిచిత వ్యక్తులు నుండి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.సైబర్ నేరాలు జరిగితే 1930 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానం ఉన్న వెంటనే పోలీస్ వారి డయల్ 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే యువత మత్తు పదార్థాలకు బానిసలు కారాదని రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పరిమిత వేగంతో వెళ్లాలని తప్పకుండా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని రోడ్డు నిబంధనాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ ఎస్సై రమేష్ కుమార్ గారు ఈ క్రింది సూచనలు చేశారు. 

    సెల్ ఫోన్  ఉపయోగం ఎక్కువైన ఈ రోజులలో సైబర్ నేరస్థులు చాలా తెలివిగా మన దగ్గరి నుండి డబ్బులు కాజేసుకుంటున్నారు. బ్యాంకు నుండి ఫోను చేస్తున్నాము మీ అకౌంట్ బ్లాక్ అయింది మళ్లీ ఆక్టివేట్ చేయాలంటే మీరు ఓటీపీ చెప్పాలి అని ఫోన్ చేస్తారు. అలాంటి వారికి మీరు రెస్పాండ్ అవ్వకూడదని ఏ బ్యాంకు వారు ఆ విధంగా ఫోన్ చేసి అలా అడగరు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అని సూచించారు. ఈ మధ్యన ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, మొదలైన షోషల్ మీడియా ప్లాటు ఫారంలపై ఫిషింగ్ లింక్స్, apk. ఆప్స్, పంపిస్తారు. ఆ లింకులని గానీ ఆ apk. యాప్స్ నీ గానీ మనము నొక్కితే ఇక మీ మొబైల్ ఫోన్ హ్యాకింగ్ చేసి మీకు తెలియకుండానే వేరేవారికి మెసేజులు పంపిస్తారు. మీ అకౌంట్ లోఉన్న అన్నిడబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అందువలన అలాంటి ఆప్స్ లేదా లింక్ లపై నొక్కకూడదు.మీ మీ ఫోన్ లో ఉన్న మీ మహిళల ఫోటోలు తీసుకుని మార్ఫింగ్ చేసి మళ్లీ మీకు పంపించి డబ్బులు అడుగుతారు ఇవ్వకపోతే ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ లలో పెట్టి మీ పరువు తీస్తారు. అందువలన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బుల్లెట్ బైక్ సెకండ్ హ్యాండ్ బైకులను మాకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయి గనుక తక్కువధరలో అమ్ముతున్నామని సోషల్ మీడియాలో అడ్వటైస్ చేసి మనకు వల వేస్తారు. యువకులు బుల్లెట్ బైక్ అనగానే నిజమే అనుకుని వారి వలలో పడి మోసపోయి డబ్బులు పొగుట్టుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. యువతీయువకులు చద్వుకుంటున్న సమయంలో తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ పేరుతో మోసపోయి తరువాత పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు.వారు ఇలాంటి ప్రలోభాలకి లోను కావద్దు, బాల్య వివాహాలు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ పోలీస్ సిబ్బంది జిల్లా పోలీసు కళాబృందం గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* ప్రవేశ పరీక్షలో మండల టాపర్గా శులామిటే సుజన్ ఇక్కడ క్లిక్ చేయండి
* డెంగ్యూ జ్వరం రాకుండా ఉండడానికి ఈ విధంగా చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
 * రుణమాఫీ కొందరికే ఇక్కడ క్లిక్ చేయండి
* జూన్ 18న, రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధుల జమ ఇక్కడ క్లిక్ చేయండి
*  నేడు ఐసెట్‌ ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* కళాజాత బృందం, పలు చట్టాలపై అవగాహన కార్యక్రమం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies