ఓటమి దిశగా వైసీపీ కీలక నేతలు..
అమరావతి Amaravati News భారత్ ప్రతినిధి : ఏపీలో కూటమి ధాటికి వైసీపీ కీలక నేతలు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, కాకాణి గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణు, జోగి రమేశ్ సహా పలువురు కీలక నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు. ఏపీలో తొలి విజయం నమోదైంది. రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50వేలకిపైగా ఓట్లతో భారీ విజయాన్ని అందుకున్నారు. వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై విజయం సాధించారు. చంద్రబాబు ఇంటికి చేరు కున్న పోలీస్ అధికారులు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో పోలీస్ అధికారులు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలను అధికారులు పర్యవేక్షిస్తు న్నారు. ఇప్పటికే కూటమి 160 సీట్లలో లీడ్‌లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ సైతం హైదరాబాద్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు బయలుదేరనున్నారు. పవన్ సైతం పిఠాపురంలో భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.