సింగరేణి ప్రాంత నాయకులతో కేటీఆర్ సమావేశం
తెలంగాణ Telangana News భరత్ ప్రతినిధి : సింగరేణి మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు.పార్టీ సీనియర్ కార్మిక సంఘం నాయకులతో గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ లోని బొగ్గు గనులను ప్రైవేటీకరించిందని ఆరోపించారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇతర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.