జర్నలిస్టును పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొర్విచెడ్ గ్రామానికి చెందిన జర్నలిస్ట్ (సైదప్ప) సైమన్ కు మెరుగైన వైద్యం అందించాలని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వైద్యులకు సూచించారు. జర్నలిస్ట్ సైమన్ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్నీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆస్పత్రికి వచ్చి సైమన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరాతీసారు. వైద్యంకోసం తనవంతు నగదు అందించి, కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. వైద్యం పూర్తయిన తర్వాత సీఎం సహాయనిధి నుంచి పూర్తిస్థాయి డబ్బులు వచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా కలిసి మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వడ్డే హన్మంతు తదితరులు పాల్గొన్నారు.