మోటారు వాహన చట్టం అమలు చేయాలి
Telangana News భారత్ ప్రతినిధి : మోటారు వాహన చట్ట నిబంధనలు తుచ తప్పకుండా అమలయ్యేలా చూడాలని హైకోర్టు స్పష్టంచేసింది. నిబంధనలను ఏమేరకు అమలు చేస్తున్నారో వివరిస్తూ కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాహనాల తనిఖీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు బాడీ కెమెరాలను తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని. తీవ్రంగా పరిగణించాలని తేల్చిచెప్పింది. మోటారు వాహనాల చట్ట నిబంధనలను తెలియజేస్తూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.