ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి : PDSU కమిటీ డిమాండ్
* కార్పొరేట్ ,ప్రైవేటు యజమాన్యాలకు అమ్ముడుపోయిన విద్య అధికారులు
* ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలలో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ
వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలలో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నప్పటికీ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని PDSU వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ G.O.MS NO :42 ప్రకారం జిల్లాలోని DFRC డిస్టిక్ ఫీజు రెగ్యులేటింగ్ కమిటీ యొక్క అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ప్రైవేట్ ,కార్పొరేట్ స్కూల్స్ ఫీజులను పెంచుకోవాలి. కానీ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అనుమతులు లేకుండా తమ ఇష్టానుసారంగా , బుక్ స్టాల్స్ తో కుమ్మక్కై తమ ఇష్టానుసారంగా నోటు పుస్తకాలు, పుస్తకాలు అధిక రేట్లకు అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నారని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ స్కూల్ యొక్క ఆరాచకాలు రోజురోజుకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పెరిగిపోతున్నప్పటికీ సంబంధించిన విద్యాధికారులు చర్యలు తీసుకోకపోవడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించడం జరిగింది. స్కూల్ డ్రెస్సులు, పుస్తకాలు, నోట్ బుక్స్, సంబంధించిన స్కూల్లో అమ్మకూడదు అని ఒక సైడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఇవేవీ పట్టించుకోకుండా వికారాబాద్ జిల్లావ్యాప్తంగా కార్పొరేట్ మరియు ప్రైవేటు స్కూల్ యొక్క దందా రోజు రోజుకు మితిమీరి పోతుంది అని ప్రశ్నించడం జరిగింది.
మాకు అడ్డు ఎవరూ లేరు అన్నట్టుగా తమ ఇష్టానుసారంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర నిబంధనలు విరుద్ధంగా ఫీజులను వాసులు చేస్తూ, ఏకంగా ఎల్కేజీ పుస్తకాలను 8000 రూపాయల నుండి 10,000రూపాయల వరకు అమ్ముతూ కొన్ని స్కూలు ఏకంగా కొన్ని వేల రూపాయల వరకు ఫీజుల దోపిడికి పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. కొన్ని బుక్ స్టాల్స్ తో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కుమ్మక్కై కమిషన్లకు పుస్తకాలను మరియు నోటు పుస్తకాలు అమ్ముతున్న పరిస్థితి నెలకొందని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు , జిల్లా విద్యాధికారి గారు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని , అక్రమ ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దానితోపాటు 25% విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయలేని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లో గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.లేదంటే జిల్లావ్యాప్తంగా PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని, పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, జిల్లా సభ్యులు అశోక్ ,సురేష్ లు పాల్గొన్నారు.