ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఏర్పాటు చేస్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రూ.2.36 కోట్ల నిధులు పాఠశాల అభివృద్ధికి మంజూరు చేశారని అన్నారు. ఇప్పటికే బడిబాట కార్యక్రమం భాగంగా 80% పనులు పూర్తయినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని సూచించారు. పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టు బోధించేందుకు ఉపాధ్యాయులను నియ మించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు బడి బయట పిల్లలను బడిలో చేర్పించేందుకు కృషి చేశారని కోరారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, బుచ్చిరెడ్డి రాము నాయక్, మండల పార్టీ అధ్యక్షులు కలల్ నరసింహులు, శంకరప్ప, సుధాకర్ రెడ్డి, ధన్ సింగ్, లక్ష్మణరావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.