రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
సిరిసిల్ల Sirisilla Newsభారత్ ప్రతినిధి : తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ముస్తాబాద్ మండలంలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొని, ఇసుక ట్రాక్టర్‌కు బందోబస్తుగా ఉండి స్టేషన్‌కు తరలిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణపై హత్యాయత్నానికి తెగబడింది. దీంతో ఆ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేశారు.