Type Here to Get Search Results !

Sports Ad

ఆరోగ్యాంగా ఉండటానికి కొన్ని ఉత్తమైన ఆహారాలు Some of the best foods to stay healthy

 ఆరోగ్యాంగా ఉండటానికి కొన్ని ఉత్తమైన ఆహారాలు 

ఆరోగ్యం Health : అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది. జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.మామిడిపండుకి మూత్ర పిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.బీట్ రూట్ బీపీని క్రమబద్దీకరిస్తుంది.మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు. ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్, ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.బీట్ రూట్ రసంలో బీపీ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది. క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.పుచ్చకాయలో ఉండే లైకొపీన్ గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

     సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందుక్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది. పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు. జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

మరిన్ని వార్తల కోసం... 
* జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే... ఇక్కడ క్లిక్ చేయండి 
* ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి : PDSU కమిటీ డిమాండ్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఆరోగ్యాంగా ఉండటానికి కొన్ని ఉత్తమైన ఆహారాలు ఇక్కడ క్లిక్ చేయండి
* విద్యుత్ షాక్ తో యువకుడు మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* పాస్ బుక్కులు, రేషన్ కార్డులు ఉన్న ఉన్న వారికే రుణమాఫీ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో IPS అధికారుల బదిలీ ఇక్కడ క్లిక్ చేయండి
* టీజీ లా సెట్ 2024 153వ ర్యాంక్ సాధించిన హరి ప్రసాద్ రెడ్డి, ఇక్కడ క్లిక్ చేయండి
* ఒక్కసారిగా పెరిగిన ధరలు...సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies